Naini Rajender Reddy: వారికి జాతకాల పిచ్చి ఉందని, ఎవరో చెప్పినట్టున్నారు మీరు జైల్లోకి వెళ్తారని? అంటూ హరీష్ రావుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. కేయూ ప్రొఫెసర్ వారి పెళ్లికి వరంగల్ కి వచ్చి.. నిర్మాణంలో ఉన్న హాస్పిటల్ గురించి మాట్లాడే వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ హరీష్ రావు? అని ప్రశ్నించారు. టైటానిక్ తీరుగా ఉన్న ఇటువంటి వరంగల్ సెంట్రల్ జైలును తీసేసి… మహారాష్ట్ర బ్యాంకుల్లో లోన్ తీసుకొని విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. వారికి జాతకాల పిచ్చి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Allu Arjun Silent: విచారణలో వీడియోలు.. నోరు మెదపని అల్లు అర్జున్..
ఎవరో చెప్పినట్టున్నారు మీరు జైల్లోకి వెళ్తారని అన్నారు. దీంతో వరంగల్ సెంట్రల్ జైలును తీసేశారన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనికి ఇప్పటివరకు వరంగల్ లో సెంట్రల్ జైలు అనేది లేకుండా చేశారని మండిపడ్డారు. 10 సంవత్సరాల పాలనలో ఉండి మీరు రెగ్యులరైజ్ చేయలేదు ఉద్యోగులను అన్నారు. మేము ఒకటి వెనుక ఒకటి చేసుకుంటా మీరు చేసిన అప్పులన్నీ కట్టుకుంటా ఉంటున్నామని తెలిపారు. ఆలోచన లేకుండా ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సులు అంటే ఆటో వారిని రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ కు 600 కోట్లతో అండర్ డ్రైనేజ్ చేశానన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని చెప్పులుతో కొడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ప్రజలకు అన్యాయం చేసింది మీరు అని తెలిపారు.
Advocate Varma: సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్.. లాయర్ ఏమన్నారంటే ?