Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక, భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రూప్- 1 పదేళ్లలో ఒక్క సారి కూడా నిర్వహించలేదు.. మేము పరీక్ష పెట్టి ఫలితాలు కూడా ఇచ్చామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పారదర్శకంగా ఫలితాలు వచ్చాయి.. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తున్నాయి.. కాస్త వాయిదా వేయండి అనే వరకు వచ్చింది పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. 6 వేల కోట్ల రూపాయలతో ఎప్పుడూ ఇలాంటి పథకాన్ని ఎవరు ప్రారంభించలేదు.. 50 వేల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాం.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం.. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల మందికి ఆర్ధిక సాయం అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: L2E Empuraan: దిల్ రాజు చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’
ఇక, రాజీవ్ యువ వికాసం మంచి ప్రోగ్రాం అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. 5 లక్షల మందికి 4 లక్షల సాయం మంచి పరిణామం.. అద్భుతమైన ఆలోచన.. మా పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ప్రాక్టికల్ గా 4 లక్షలు ఇస్తామంటున్నారు బాగుంది.. స్వయం ఉపాధి వైపు వెళ్లడానికి ఇదో మంచి ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ పార్టీగా సూచన.. మహిళలు, యువతకి దగ్గరవ్వండి.. బీసీలకు ఎమ్మెల్సీలో ప్రాధాన్యత ఇచ్చారు.. వెలుగు రేకలతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అని కూనంనేని చెప్పుకొచ్చారు.
Read Also: Ugadi 2025: రాబోయే ‘విశ్వావసు నామ’ సంవత్సరంలో మీ ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయంటే!
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం.. ఉపాధి కల్పిస్తున్నామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. యువత వీటిని ఉపయోగించుకోవాలి.. ఇదే కాంగ్రెస్ మార్క్ పాలన అని తెలిపారు. మరోవైపు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఇవ్వట్లేదు.. రాజీవ్ యువ వికాసంలో ముస్లిం యువతకు అవకాశాలు కల్పించాలి అని కోరారు. ఇప్పటికే కులగణన చేశారు.. వివరాలు మీ దగ్గర ఉన్నాయని వెల్లడించారు.