Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కాగా తాజాగా రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మూవీ టీమ్.
కాగా ఇటీవల మహా శివరాత్రి పండుగ సందర్భంగా ‘ఆదిత్య 369’ సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ, డేట్ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు 4K వెర్షన్‌లో ఏప్రిల్ 11న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సౌండ్ కూడా 5.1 క్వాలిటీ లోకి కన్వర్ట్ చేశామని.. ప్రసాద్స్ డిజిటల్ టీం 6 నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారని, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే వింటేజ్ బాలయ్యను మరోసారి థియేటర్ లో చూసి అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!