Site icon NTV Telugu

Telangana Assembly: ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..

Tg Assembly

Tg Assembly

Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా.. ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ సెషన్స్ లో రేవంత్ ప్రభుత్వ ఏడాది పాలన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ ప్రక్షాళన లాంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Read Also: Assam: అస్సాం సర్కార్ కీలక నిర్ణయం.. బీఫ్‌ విక్రయాలపై నిషేధం

ఇక, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సైతం ప్లాన్ వేస్తున్నాయి. గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఘటన, రైతు భరోసా, ధాన్యానికి రూ. 500 బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే ఛాన్స్ ఉంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారే జరిగాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. ఆ రోజు సెషన్స్ ముగిసిపోక ముందే వెళ్లిపోయారు. ఈ సారైనా అసెంబ్లీ సెషన్స్ కు కేసీఆర్ వస్తారా.. లేదా అనేది ఉత్కంఠ రేపుతుంది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే.. కాంగ్రెస్ సర్కార్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

Exit mobile version