Telangana Assembly 2024: నేడు తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ..
- సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలు..
- సీఎం తరపున సమాధానాలు ఇవ్వనున్న మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly 2024: రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేటి (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల (డిసెంబర్) 9న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాగా, తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం సభలు 16వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం తెలంగాణ యువభారతి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది.
Read also: Allu Arjun: వివాదాల వేళ.. బన్నీ ఆకాశమే నీ హద్దు.. జనసేన నేత ఆసక్తికర కామెంట్స్
Also Read
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సోమవారం జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో శాసనసభ, మండలి ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి దాదాపు వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. కొత్త ROR 2024 చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు సమాచారం. అసెంబ్లీ, మండలిలో ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న శాఖలకు సంబంధించిన బిల్లులు, సమాధానాలు, ఇతర అంశాలను సీఎం తరపున ప్రవేశపెట్టడం, సమాధానాలు ఇవ్వడం, నోట్ చేసుకోవడం వంటి బాధ్యతలను కొందరు మంత్రులకు అప్పగించారు.
Read also: Allu Arjun: వివాదాల వేళ.. బన్నీ ఆకాశమే నీ హద్దు.. జనసేన నేత ఆసక్తికర కామెంట్స్
సీఎం తరపున సమాధానాలు ఇవ్వనున్న మంత్రులు వీరే..
* మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, లా శాఖలను శ్రీధర్ బాబుకు అప్పగించారు.
* జూపల్లి కృష్ణారావుకు వాణిజ్య పన్నుల శాఖ,
* దామోదర రాజనర్సింహకు విద్యాశాఖ,
* హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖలు పొన్నం ప్రభాకర్‌కు,
* సీతక్కకు మైనారిటీ సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ శాఖలు,
* కొండా సురేఖకు దివ్యాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను అప్పగించారు.
Manchu Family: మంచు కథా చిత్రమ్.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!