Maheshwar Reddy vs Sridhar Babu: పీవీ నరహింహా రావుకి భారత రత్న ఇచ్చింది పీఎం మోడీ అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం నిర్వహించిన అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్డినెన్సు తెస్తే చించి అవమాణించినది రాహుల్ గాంధీ అని అసెంబ్లీలో తెలిపారు. సంతాపంలో ఆయన కీర్తితో పాటు అవమానాలు కూడా చెప్తున్న రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారా..? లేదా..? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భక్తి శివుడి మీద… చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఉంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అని అన్నారు. మన్మోహన్ సింగ్ సేవలు, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజలు మర్చిపోరన్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారన్నారు. స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. డిల్లీలో స్థలాన్ని కేటాయిస్తామని అయన కుటుంబ సభ్యులకు అధికారులు వెళ్లి చెప్పారన్నారు.
Read also: KTR: మన్మోహన్ సింగ్ కే కాదు పీవీ కి కూడా.. అసెంబ్లీలో కేటీఆర్..
పీవీ నరసింహా రావుకి డిల్లీలో స్థలం కేటాయించలేదని, భారత రత్న కూడా ఇవ్వలేదని తెలిపారు. సోనియా కుటుంబం పీవీ మీద కక్ష పెట్టుకున్నారన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి భారత రత్న ఇవ్వకపోతే బీజేపీ ఇచ్చిందన్నారు. మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్డినెన్సు కాపీలను చించి వేసింది రాహుల్ గాంధీ .. మన్మోహన్ సింగ్ ను అవమానించారన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం రాహుల్ గాంధీ వియత్నాం వెళ్ళారట అన్నారు. మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో చెబుతున్నా అన్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పు పట్టారు. సంతాప సభలో రాజకీయ ప్రసంగం ఎందుకు..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రికార్డు నుండి తొలగించాలని అనడంతో.. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుండి స్పీకర్ తొలగించారు.
Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే..