South Central Railway: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా, సికింద్రాబాద్-పుణె మధ్య నడుస్తున్న శతాబ్ది, గోల్కొండ మరియు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో సహా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని డౌండ్ రూట్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో మూడో రైలు లైను పనుల వల్ల రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుందని తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18046), సికింద్రాబాద్-తిరుపతి మధ్య పద్మావతి, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య గోదావరి, సికింద్రాబాద్-గూడూరు మధ్య సింహపురి, ఆదిలాబాద్-తిరుపతి మధ్య కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Read also: MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..
రద్దు చేయబడిన రైళ్లు లిస్ట్ ఇదే..
* జూలై 30: సికింద్రాబాద్-ముంబయి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12220)ను రద్దు చేశారు.
* జూలై 31: ముంబై-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు (12219)ను రద్దు చేశారు.
* జూలై 29, 31 ఆగస్టు 1 తేదీల్లో : పూణే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు (నెం. 12205) రద్దు చేశారు.
* జూలై 29, 31 తేదీల్లో : సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు (12206) రద్దు చేయబడింది.
* జూలై 31న : నిజామాబాద్-పుణె మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (11410)ను రద్దు చేశారు.
* ఆగస్టు 5 నుంచి 10 వరకు : సికింద్రాబాద్-విజయవాడ (ట్రైన్ నంబర్ 12714), విజయవాడ-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 12713) శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు .. గుంటూరు-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 17201), సికింద్రాబాద్-గుంటూరు (ట్రైన్ నంబర్ 17202) రద్దు చేశారు.
* ఆగస్టు 5 నుంచి 10 వ తేదీ వరకు : డోర్నకల్-విజయవాడ (ట్రైన్ నంబర్. 07755), విజయవాడ-డోర్నకల్ (ట్రైన్ నంబర్. 07756), విజయవాడ-భద్రాచలం రోడ్ (ట్రైన్ నంబర్. 07979), భద్రాచలం రోడ్-విజయవాడ (ట్రైన్ నంబర్. 07278) రైళ్లు రద్దు చేయబడ్డాయి.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు