బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. నిలకడగా ఉంది. అలాగే వెండి ధర భారీగా పెరిగింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. కరోనా కేసులు పెరుగుతుండటం తో బంగారం, వెండి ధరల పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. అందుకే నిన్న బంగారం వెండి ధరలు పెరిగాయి.
అయితే నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480 గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 66,100 కి చేరుకుంది.