NTV Telugu Site icon

R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఫైర్..

Rs Praveen Kumar

Rs Praveen Kumar

R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కొండా సురేఖపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఫైర్ అయ్యారు. ఆర్‌ఎస్‌ కుట్రచేసి విష ఆహారం తినిపిస్తున్నారన్న కొండా సురేఖ మాటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మీరు ఒక మాతృమూర్తి.. మీకు ఒక ఆడపిల్ల ఉంది..అలాంటి మాటలు మాట్లాడ వచ్చా? అని ప్రశ్నించారు. నా సొంత పిల్లలను వదిలేసి, వేలాది మంది విద్యార్థులను నా పిల్లలు అనుకొని సేవ చేశానని గుర్తు చేశారు. వరంగల్ లో మీరు ఎన్నో అఘాయిత్యాలు చేశారన్నారు.

Read also: Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి.. 15 గ్రామాల్లో హై అలర్ట్..

అప్పట్లో మిమ్మల్ని నడిరోడ్డు మీద ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం మరిచి పోయారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అప్పుడు సీఐగా ఉన్నారు.. ఆయనను అడగండి చెబుతాడని అన్నారు. రేవ్ పార్టీ ల గురించి, బిర్యానీల గురించి రీల్స్ చేసే మీరు.. అన్నం లేని గురుకుల పాఠశాల విద్యార్థుల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘోరమైన చరిత్ర ఉన్న కొండా సురేఖ.. మా గురించి మాట్లాడితే సహించం అని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు మేము గురుకుల బాట పట్టామన్నారు.

Read also: MLA Aadi Srinivas: వాడు వీడు అంటే మేము అనాల్సి వస్తుంది.. కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఫైర్‌..

మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్‌ఎస్‌కు అప్పగించండి అన్నారు. కొండా సురేఖ స్థాయికి నేను దిగజారి దలుచుకోలేదని అన్నారు. మీరు భవిష్యత్‌లో తెలంగాణలో మాట్లాడకండి అని సూచించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణలో మహిళలు తల దించు కుంటున్నారు అన్నారు. కోర్టు కూడా కొండా సురేఖ భాష వినలేక పోయిందని ఆర్‌ఎస్ తెలిపారు. మీకు మంత్రి పదవి లో ఉండే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నా గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదన్నారు. నేను దేశం కోసం పోరాడిన వ్యక్తిని అన్నారు. ఎక్కడో అలంపూర్ మారుమూల గ్రామంలో పుట్టిన నేను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని గుర్తుచేశారు ప్రవీణ కుమార్‌. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు.
KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..

Show comments