Harish Rao: తెలంగాణ భవన్ లో నిరుద్యోగ యువతతో ముఖాముఖిలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని వాళ్లు వచ్చి మమ్మల్ని కలిశారని ఆరోపించారు. చలో సెక్రటేరియట్ చేపడుతున్నామని.. దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు.. మా సంపూర్ణ మద్దతు ఉంటుందని నిరుద్యోగులకు చెప్పాం.. మా హయాంలో లక్ష ఆరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాము.. కానీ, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే అసెంబ్లీని వాయిదా వేసుకొని వెళ్లారు.. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇరవై నెలల్లో 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు అని హరీష్ రావు వెల్లడించారు.
Read Also: Warangal Congress Clash: కమిటీ ముందుకు రావాలని.. నన్ను ఎవరు పిలవలేదు..
అయితే, విద్యార్థులు నోటిఫికేషన్లు వద్దు అన్నారని ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు.. ఇందిరా గాంధీ మనుమరాలిగా మాట్లాడుతున్నాను అని చెప్పిన ప్రియాంక ఇప్పుడు ఎటు పోయింది అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ కాస్త దగా క్యాలెండర్ లాగా మారిపోయింది అని మండిపడ్డారు. ఆరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము చదువుకునే దగ్గరకు వచ్చి కాంగ్రెస్ కు ఓట్లు వేయమని కోదండరాం, మురళి, రియాజ్ లు చెప్పారని విద్యార్థులు చెప్పుకొచ్చారు.. ప్రియాంక గాంధీతో పాటు విద్యార్థులకు దొంగ మాటలు చెప్పిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి.. కానీ, విద్యార్థులకు మాత్రం జాబ్స్ రాలేదని హరీష్ రావు ఆరోపించారు.
