Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణ ఘటన
- భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య
- పోక్సో కేసు పెట్టారన్న కక్షతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Reddy Shabad Horror: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే రోజు ఆరుగురు దారుణ హత్యకు గురికావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, నిందితుడు రాజు కుమార్ (28) తన భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు తనపై గతంలో పోక్సో కేసు నమోదు చేసిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, నానమ్మలను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
రెండు ప్రాంతాల్లో హత్యలు
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు రాజు కుమార్ (28) మొదట తన ఇంట్లో నిద్రిస్తున్న భార్య పార్వతి సరిత (30), కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)లను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోక్సో కేసులో బాధితురాలైన 17 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి, అక్కడ ఆమె తల్లి చిట్యాల లక్ష్మీ (45), నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి బాలికను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
Also Read
- Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
పోక్సో కేసు నేపథ్యం
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిపై గతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చిన అనంతరం ఈ ఘోరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు పోక్సో కేసు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బందోబస్తుతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై హత్య, లైంగిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీులు తెలిపారు.
మృతుల వివరాలు
పార్వతి సరిత (30) – నిందితుడి భార్య
పరీక్షిత్ (3)
దైవిక్షిత్ (2)
చిట్యాల రుక్కమ్మ (65)
చిట్యాల లక్ష్మీ (45)
17 ఏళ్ల మైనర్ బాలిక
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!