సూపర్ కృష్ణ కుమారుడు రమేశ్‌బాబు గత రాత్రి మరణించిన విషయం తెలిసిందే. రమేశ్‌బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాలేయం వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ఎఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా రమేశ్ బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తి చేశారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.