స్రీలు రోజూ ఏదో ఒక చోటా లైంగికంగా వేధించబడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ప్రత్యక్షంగా వేధింపులకు గురవుతుంటే.. కొన్ని సార్లు పరోక్షంగా వేధింపుల బారిన పడుతున్నారు. అలాంటి ఘటనే ఇది. గుర్తుతెలియని నెంబర్ల నుంచి కొందరు మహిళలకు అసభ్యకరమైన వీడియోలు వస్తున్నాయి. అయితే దీంతో.. ఆ నెంబర్‌ను బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి వీడియోలు పంపుతున్నారు. దీంతో వేధింపులు తాళలేక ఓ మహిళ హైదరాబాద్ లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. మహిళలకు అసభ్యకరమైన వీడియోలు పంపిస్తున్నది 58 ఏళ్ల వృద్ధుడు రియసుద్దిన్ అని తెలిసి పోలీసులు షాకయ్యారు.
Physically Harassment : హైదరాబాద్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం..
ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ లో కాంటాక్ట్ నంబర్ ఉన్న మహిళ ను గుర్తించి నంబర్ సేకరిస్తున్న నిందితుడు. ఆ నంబర్ లకు వేరు వేరు నంబర్ ల నుండి అసభ్య కర విడియో లు పంపిస్తున్నాడు. అయితే.. రియసుద్దిన్ నంబర్ బ్లాక్ చేస్తే ఇతర నంబర్ల నుండి వీడియోలు పంపిస్తున్నాడు. మొత్తం మూడు నంబర్ల నుండి వీడియోలు పంపిస్తున్నాడు. అయితే.. యువతులకు, మహిళలకు ఆశ్లీల వీడియోలు పంపుతున్నది వృద్ధుడని తెలిసి అవాక్కైన పోలీసులు.. ఆ తరువాత సదరు వృద్ధుడిని అరెస్ట్ చేశారు.