N Convention: హైడ్రా కూల్చివేతలు.. ఎన్ కన్వెన్షన్ నేలమట్టం..

  • హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెనషన్ ను కూల్చివేస్తున్న హైడ్రా..
  • తుమ్మిడి చెరువుు కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు..
  • భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్న హైడ్రా..
  • ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను మూసివేసిన పోలీసులు..
N Con

N Con

N Convention: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్​ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత పనులను కొనసాగించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు. ఇక, కన్వెన్షన్ కు వెళ్లే దారులను పూర్తిగా పోలీసు పికెటింగ్ పెట్టి ఎవరిని అనుమతించకుండా కూల్చివేతలు కొనసాగించారు. మాదాపూర్ లోని తమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల భూమిని ఆక్రమించి గతంలో ఎన్ కన్వెన్షన్ ని నిర్మించిన నాగార్జున.. దీంతో ఈ కన్వెన్షన్ పై అనేక ఆరోపణలు రావడంతో తెల్లవారుజాము నుంచే కూల్చివేతల కార్యక్రమం హైడ్రా చేపట్టింది.