Site icon NTV Telugu

MLC Addanki Dayakar: కవిత మాటల వెనుక కేసీఆర్ ఉన్నాడు.. వాళ్ళది ఫ్యామిలీ డ్రామా

Addanki

Addanki

MLC Addanki Dayakar: చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి హరీష్ రావు పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పైన మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావువి పిచ్చి కూతలు.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఆ నాడు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసిఆర్ మాట్లాడాడా..? అని అడిగారు. ఇక, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నోటికొచ్చినట్లు మాట్లాడలేదా..? అని క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడాడా లేక రాయలసీమ ముఖ్యమంత్రి అనుకున్నాడా..? అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

Read Also: TTD: భూమన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే.. కొట్టిపారేసిన టీటీడీ..

ఇక, వైఎస్ జగన్ తో కేసీఆర్ ఎందుకు స్నేహం చేశాడు.. నాలుగు సార్లు ఎందుకు ప్రగతి భవన్ కు పిలిచాడు? అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. తెలంగాణ జల వనరులను తాకట్టు పెట్టి ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారు.. బనకచర్ల ప్రాజెక్టు పైన కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు? అని అడిగారు. బేసిన్లు లేవు బేషజాలు లేవని కేసీఆర్ ఆనాడు ఇష్టానుసారంగా మాట్లాడలేదా?.. బనకచర్లకు అవకాశం ఇచ్చిందే కేసీఆర్.. ఆనాడు కళ్లు మూసుకొని కూర్చొన్నాడు అని మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండుసార్లు జరిగితే కేసీఆర్ హాజరు కాలేదు.. ప్రాజెక్టుల పేరు మీద బ్యాగులు మోసుకుపోయింది బీఆర్ఎస్ నాయకులే అని ఆరోపించారు. చీప్ క్యారెక్టర్ ఉన్న చీఫ్ మినిస్టర్ కేసీఆర్.. తెలంగాణను దొంగల దొడ్డిగా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని పేర్కొన్నారు. ఇక, కవిత మాటల వెనుక కేసీఆరే ఉన్నారు.. వాళ్లది ఫ్యామిలీ డ్రామా అని ఎద్దేవా చేశారు. కవితకు ఎందుకు కేసీఆర్ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.

Exit mobile version