MLC Addanki Dayakar: చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి హరీష్ రావు పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పైన మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావువి పిచ్చి కూతలు.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఆ నాడు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు.
Addanki Dayakar: జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ తీరును తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఆ సభలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు కూడా మాట్లాడే అవకాశం…