Site icon NTV Telugu

Jupally Krishna Rao: హెచ్సీయూలో ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. చెట్లు పెరిగితే అడివైతదా..?

Jupalyy

Jupalyy

Jupally Krishna Rao: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. అయితే, ఒక ప్రైవేట్ కంపెనీకి భూమి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడింది అని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీకి 400 ఎకరాలు వెళ్తే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదు అన్నారు. ఇక, హెచ్సీయూలో చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా? అని ప్రశ్నించారు. ఇక, 20 సంవత్సరాల నుంచి పడావుగా ఉన్న భూమిలో చెట్లు పెరుగుతాయి కదా అని మంత్రి జూపల్లి తెలిపారు.

Read Also: Waqf Bill: కాంగ్రెస్ ఉంటే పార్లమెంట్‌ని కూడా “వక్ఫ్” స్వాధీనం చేసుకునేది..

ఇక, హెచ్సీయూ పులులు, జింకలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తపన పడుతున్నారు అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇక్కడ భూమి తీసుకున్నందుకు మరో చోట భూమిని యూనివర్సిటీకి ఇచ్చారని తెలిపారు. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

Exit mobile version