శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు.. రూ. 7 కోట్లు విలువ చేసే కేజీ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ SOT, మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుంది అంతర్రాష్ట్ర ముఠా. రాజస్థాన్కు చెందిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.