Site icon NTV Telugu

Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..

Trap

Trap

కొందరి స్త్రీ, పురుషుల ప్రవర్తన కుటుంబ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికాని యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్రెడీ పెళ్లైన వారు వారిని విడిచి పెట్టి కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్త, భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగ హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసింది. భర్తను పిల్లలను వదిలి ప్రియుడి కోసం నగరానికి చేరుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Also Read:Poonam Kaur: నేను ఇబ్బంది పడ్డా.. పోసాని ఆరోగం గురించి దిగులుగా ఉంది!

35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత 22 ఏళ్ల వయసున్న ఓ యువకుడితో ఫోన్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ప్రియుడి మోజులో భర్త పిల్లలను విడిచి అతనితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిపై నిఘా పెట్టి భైక్ పై వెల్తున్న ఇద్దరిని అడ్డగించాడు.. దీంతో భైక్ ను వదిలి పరారైన సంఘటన గత నెల 5 వ తేదిన పేట్ బషీరాబాద్ పీఎయస్ పరిదిలో చోటుచేసుకుంది.

Also Read:CM Revanth Reddy: ఖ‌నిజ అక్రమ త‌వ్వకాల‌పై ప్రభుత్వం ఉక్కు పాదం..

ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కు చెందిన మిరియం పల్లి పేరయ్య కుమారుడు గోపి (22 )ని కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫోన్ యాప్ లో గోపికి వరంగల్ జిల్లా బావోజిగూడెం కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన సుకన్య (35) పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు.. ఇది గమనించిన భర్త జయరాజ్ (38 )సుకన్యను మందలించాడు.

Also Read:CM Revanth Reddy: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం రోజు ప్రారంభించే పథకాలు ఇవే!

ఈక్రమంలో గత నెల 5 వతేదిన సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిని కలవడానికి నగరానికి వచ్చింది. ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది. నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు ఫోన్లను స్విచ్చాప్ చేశారు. చివరిసారిగా బైక్ పై వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version