Liquor Sales: మందు బాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31న ఆ టైం వరకే అనుమతి..
- 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు..
- అన్ని వైన్ షాపులను ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: ఈ నెల 31న నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను పొడిగించారు. 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్‌లు, రెస్టారెంట్లు, ఈవెంట్‌లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం విక్రయించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read also: ED Notices KTR: విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..
Also Read
అదే విధంగా అన్ని వైన్ షాపులను ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని వెల్లడించింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వాడకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!