KTR Open Challenge: అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్ సంచలన ప్రకటన..
- వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సవాల్..
- కొండారెడ్డిపల్లిలో వందశాతం రుణమాఫీ అయ్యిందేమో అడగండి..
- ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిలదీసిన కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Open Challenge: వందశాతం రుణమాఫీ అయ్యిందంటున్నారు.. ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపించినా.. చివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతులకు వందశాతం రుణమాఫీ అయ్యిందేమో అడగండి.. వందశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించిన కేటీఆర్.. తలరాత మార్చమని అధికారం ఇచ్చారు.. కానీ, తల్లిని మార్చమని కాదు.. అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు.. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే ఉంది.. బహుజన తల్లి బంగారం వేసుకోకూడదా? అని నిలదీశారు.
Read Also: ICC Banned NCL USA: కొరడా ఝుళిపించిన ఐసీసీ.. చిన్న పొరపాటుకు ఆ లీగ్‌పై నిషేధం
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ విగ్రహం తెలంగాణ తల్లిది కాదు.. కాంగ్రెస్ తల్లిది అని విమర్శించారు కేటీఆర్.. అధికారంలో ఉన్న పార్టీ మారితే తల్లి మారుతుందా? అని మండిపడ్డారు. వీళ్లు ఏం చేసినా మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది.. మూడేళ్ల తర్వాత రాహుల్ తండ్రిని, కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్‌కు పంపిస్తాం అని స్పష్టం చేశారు.. ఉద్యమ సమయంలో ఆవిష్కరించిన విగ్రహాల గురించి కోదండరాంను అడగండి.. అందెశ్రీ రాసిన పాటలో కేసీఆర్ చరణం కూడా ఉంది అని గుర్తుచేశారు.. బతుకమ్మ తీసేసి చెయ్యి పెట్టారు.. మేం పేదల బతుకులు మార్చే పనిచేశాం.. పేర్లు మార్చే పనిచేయలేదు.. అలా చేసుంటే రాజీవ్, ఇందిరా గాంధీ పేర్లతో ఒక్క సంస్థ ఉండేది కాదు అని హెచ్చరించారు..
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!