వందశాతం రుణమాఫీ అయ్యిందంటున్నారు.. ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపించినా.. చివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతులకు వందశాతం రుణమాఫీ అయ్యిందేమో అడగండి.. వందశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగసవాల్ విసిరారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.