Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
- లైంగిక వేధింపుల ఆరోపణలపై భారీ ఒప్పందం
- ఏళ్ల తరబడి సాగిన బాధితుల న్యాయపోరాటం
- ఆరోపణలు రుజువైన వారి పేర్లు బహిర్గతం చేయాలని నిర్ణయం
- బీమా సంస్థల నుంచి అదనపు పరిహారానికి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో కాథలిక్ చర్చి చరిత్రలోనే అత్యంత భారీ సెటిల్మెంట్లలో ఒకటి వెలుగు చూసింది. మతాధికారులు, సిబ్బంది చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపించిన సుమారు 1,300 మంది బాధితులతో న్యూయార్క్ కాథలిక్ ఆర్చ్డయాసిస్ 80 కోట్ల డాలర్ల (దాదాపు 800 మిలియన్ డాలర్లు) భారీ ఒప్పందానికి అంగీకరించింది. శనివారం (అక్టోబర్ 24) బాధితుల తరఫు న్యాయవాదులు ఈ చారిత్రక ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. మతాధికారులకు పంపిన ఈ-మెయిల్లో ఆర్చ్డయాసిస్ ఆర్చ్‌బిషప్ రోనాల్డ్ హిక్స్ సైతం ఈ పరిణామాన్ని ధృవీకరించారు. ఒప్పందం కుదిరిందని, త్వరలోనే లాంఛనంగా సంతకాలు పూర్తికానున్నాయని తెలిపారు. నవంబర్ 6వ తేదీతో మొదలయ్యే వారంలో తుది పత్రాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.
ఏళ్ల తరబడి సాగిన న్యాయ పోరాటం..
లైంగిక వేధింపుల ఆరోపణలపై గత ఏడేళ్లకు పైగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి ఈ ఒప్పందంతో తెరపడింది. దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితులు, వారి తరఫు న్యాయవాదులు ఈ ఒప్పందాన్ని బాధ్యతాయుతమైన, చారిత్రక విజయంగా అభివర్ణించారు. బాధితుల తరఫు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది జెఫ్ ఆండర్సన్ మాట్లాడుతూ.. న్యాయం కోసం సాగిన ఈ ప్రయాణంలో బాధితులు ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల అసాధారణమని కొనియాడారు. ఈ ఒప్పందం ద్వారా చర్చిలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఒప్పందం బాధితులు మానసిక క్షోభ నుంచి కోలుకుని, స్వస్థత దిశగా అడుగులు వేయడానికి దోహదపడుతుందని ఆర్చ్‌బిషప్ హిక్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
- ASEAN Summit 2026: ప్రపంచానికి ఇప్పుడు శాంతి, స్థిరత్వమే అత్యవసరం.. ఆసియాన్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
నిందితుల పేర్ల బహిర్గతం.. అదనపు పరిహారానికి అవకాశం
ఈ భారీ ఆర్థిక సెటిల్మెంట్తో పాటు బాధితుల డిమాండ్ మేరకు చర్చి కొన్ని కీలక షరతులకు అంగీకరించింది. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులకు సంబంధించిన పత్రాలను విడుదల చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఆరోపణలు రుజువైన మతాధికారులు , సిబ్బంది పేర్లను ఆర్చ్డయాసిస్ బహిరంగంగా ప్రచురించాలని, తదుపరి విచారణలో నిరూపితమయ్యే పేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, చర్చికి చెందిన బీమా సంస్థలపై న్యాయపరమైన పోరాటం ద్వారా బాధితులు అదనపు పరిహారం పొందేందుకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది. అదే సమయంలో ఆర్చ్డయాసిస్ దివాలా ప్రక్రియలోకి వెళ్లకుండా రక్షించుకోవడానికి కూడా ఇది తోడ్పడనుంది.
చట్టంలో మార్పులే కీలక మలుపు
అమెరికాలో పాత కాలపు లైంగిక వేధింపుల కేసులపై దర్యాప్తునకు మార్గం సుగమం చేస్తూ 2019లో న్యూయార్క్ ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ (కాలపరిమితి) కారణంగా నిలిచిపోయిన లైంగిక వేధింపుల పౌర వ్యాజ్యాలను దాఖలు చేసే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది. అంతేకాకుండా, తప్పు చేసిన వారిని కాపాడటానికి ప్రయత్నించిన సంస్థలపై కూడా కేసులు పెట్టేందుకు చట్టం తలుపులు తెరిచింది. ఏళ్ల క్రితం జరిగిన అన్యాయాలపై న్యాయపోరాటం చేసేందుకు ఈ తాత్కాలిక వెసులుబాటు లభించడంతో వేలాది మంది బాధితులు మత సంస్థలపై న్యాయపోరాటానికి దిగారు.
అమెరికా చర్చి చరిత్రలో రెండో అతిపెద్ద సెటిల్మెంట్
అమెరికాలో కాథలిక్ ఆర్చ్డయాసిస్తో కుదిరిన ఒప్పందాల్లో ఇది రెండో అతిపెద్దదిగా నిలిచింది. అంతకుముందు 2024లో లాస్ ఏంజెల్స్ ఆర్చ్డయాసిస్ సుమారు 1,000 మంది బాధితులకు 880 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే, గత జూన్ 2026లో శాన్ ఫ్రాన్సిస్కో ఆర్చ్డయాసిస్ సైతం వందలాది కేసుల నేపథ్యంలో 395 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ను కుదుర్చుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా లైంగిక వేధింపులు, సంస్థాగత వైఫల్యాలపై బాధితులు వరుసగా న్యాయపోరాటాలు చేస్తుండటంతో అమెరికా వ్యాప్తంగా కాథలిక్ చర్చిలు వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చెల్లించాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Rudransh Thakur: స్కూటర్ ముందు నిలబడి ఓ లుక్కిచ్చాడు అంతే.. బుడ్డోడి స్వాగ్కి నెటిజన్లు ఫిదా..
-
Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
-
Rachin Ravindra: టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోయాం.. టెస్టులో అలా ఉండదు.. భారత్‌ను దెబ్బ కొడతాం..
-
Airport Security: ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుంచి CISF సిబ్బంది తగ్గింపు.. వారి స్థానంలో..
-
MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..