KTR Sends Legal Notice: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
- టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
- ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు..
- బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Sends Legal Notice: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. తనపై ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Also: Israel Iran War: అమెరికా నుంచి 14,000 కిలోల “బంకర్ బస్టర్” బాంబు కోరుతున్న ఇజ్రాయిల్..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
అయితే, టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారని టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమైన చర్య.. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి అని విమర్శించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమని ఆరోపించారు. ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి.. చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారని మహేష్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!