Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Komati Reddys Key Comments On Telangana Thalli Statue

Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు

Published Date :December 9, 2024 , 12:41 pm
By Bhanu
  • మన తల్లికి కిరటం లేదు.. మన తల్లికి మెడలో నెక్లేస్ లేదు..
  • అచ్చ తెలంగాణ మహిళను పోలి ఉంటే ఆస్తిత్వం దెబ్బతిందా?
  • కిరీటం లేదని అమ్మను అమ్మ కాదంటమా? ఇదెక్కడి వాదన..
Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ ముందుగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుణ్యానే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు శుభాకాంక్షలు తెలిపాల్సింది పోయి.. బయట నినాదాలు చేయడం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో అసలు తెలంగాణ పదమే లేదని మంత్రి అన్నారు.

Read also: Atchannaidu: అన్ని శాఖల్లో సమీక్ష నిర్వహించాం.. నిధులు లేవు..

తెలంగాణ తల్లి అంటే దేవతలా కాదు- మన ఇంట్లో అమ్మలా ఉండాలని తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌ కు లేదని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. తెలంగాణ రాదనుకున్న సమయంలో నాలుగుకోట్లు మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తల్లి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చరిత్రలో నిలిచి పోయిన రోజు అన్నారు. మా ముద్దు బిడ్డ శ్రీకాంతాచారి ఎల్బీనగర్‌ చౌరస్తాలో కాల్చుకుని జై తెలంగాణ అనే నినాదంతో నాలుగు రోజులు మృత్యువుతో పోరాటం చేసి మృతి చెందాడని అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారు.

Read also: GV Prakash : డివోర్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్‌ టైమ్‌ ఒకే స్టేజ్‌పై మాజీ దంపతులు

ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు.. మన ఆస్తిత్వనికి ప్రతికలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవ్వాల తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్బం అని మంత్రి అన్నారు. నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా అన్నారు. 3 సంవత్సరాలు మంత్రి పదవిని అనుభవించే అవకాశం ఉన్న రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అటు వైపు చూడలే అన్నారు. మిలియన్ మార్చ్ లో రబ్బర్ బుల్లెట్స్ తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు.

Read also: Maoist Party: ఏజన్సీ ప్రాతంలో టెన్షన్.. టెన్షన్.. నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఇన్ని చేసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు.. మన తల్లిలాంటి తల్లి లేకుండా కిరీటాలతో, వజ్ర వైడుర్యాలతో ఉన్న తల్లిని తీస్తారా అని కామెంట్స్ బాధాకరం అన్నారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాగో, మన పల్లెటూరి తల్లిలాగో ఉంటుందని భావిస్తే.. ఇదేంటి ఇలా ఉందనిపించిందన్నారు. మన పోరాటాలు, ఉద్యమాలు, శ్రమజీవులకు ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే మన తల్లిలాగ ఉండాలని ఇవ్వాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిందని తెలిపారు.

Read also: Bollywood : హిందీలో డే-1 కంటే డే- 4 ఎక్కువ రాబట్టిన పుష్ప -2

తెలంగాణ అంటే ఆత్మగౌరవం, స్వేచ్చా, చైతన్యం.. కానీ, గత పదేండ్లలో జరిగిన సంఘటనలు మనకు మాయని మచ్చల్లా వెంటాడుతున్నయన్నారు. అందుకే, ఇప్పుడు తెలంగాణ అస్థిత్వాన్ని సరైన స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే మన అస్థిత్వానికి ప్రతీకలు, నిజాయితీకి నిలువుటద్దాలు, కష్టానికి ప్రతిరూపాలైన వ్యవసాయం చేసుకునే స్త్రీమూర్తిని.. పోలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. తెలంగాణ తల్లి నమూన విడుదల చేయగానే.. తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, వంటికి పట్టుచీర లేదు.. తెలంగాణ అస్థిత్వాన్ని ఆగం చేస్తున్నరని కొందరు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

Read also: Bhatti Vikramarka: తెలంగాణ తల్లి విగ్రహం.. మార్చకుండా చట్టం..

మన తల్లికి కిరటం లేదు.. మన తల్లికి మెడలో నెక్లేస్ లేదు.. అచ్చ తెలంగాణ మహిళను పోలి ఉంటే ఆస్తిత్వం దెబ్బతిందా? అని ప్రశ్నించారు. కిరీటం లేదని అమ్మను అమ్మ కాదంటమా? ఇదెక్కడి వాదన అని అసెంబ్లీలో కోమటి రెడ్డి మండిపడ్డారు. మంత్రిగా.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకునిగా.. నేను వాళ్లకు ఒక మాట చెప్పదల్చుకున్న అన్నారు. రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణ పేరు తొలగించుకునే అవకాశవాద పార్టీ కాదు కాంగ్రెస్ అన్నారు. ⁠రాజకీయాల కోసం తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నవాళ్లకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఈ రాష్ట్రంలో పార్టీ పేరుకు ముందు తెలంగాణ అని రాసుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • komati reddy venkat reddy
  • Komati Reddy Venkat Reddy sensational comments
  • Telangana Assembly Sessions 2024
  • Telangana thalli statue

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions