Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రేవంత్, ఈటల, రఘునందన్ టార్గెట్!

Phone Tapping

Phone Tapping

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది. నవంబర్ 15వ తేదీన 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లే గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు ప్రణీత అండ్ గ్యాంగ్ పాల్పడింది. ఒకే రోజు 600 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక, మావోయిస్టుల పేరు చెప్పి ప్రభాకర్ రావు ఫోన్లు ట్యాప్ చేశారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద ప్రభాకర్ రావు నెంబర్లు ఇచ్చినట్లు సమాచారం.

Read Also: Se*xual Assault: జైలు నుండి విడుదలై రెండు రోజులు కాలేదు.. 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం..!

అయితే, సాధారణ ఎన్నికల్లో మావోయిస్టుల యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పారు. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేలింది. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించినట్లు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ అధికారపక్ష నాయకుల ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సమాచారం. ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకున్నారు.

Read Also: Iran-Israel conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు

ఇక, శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చారు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ రావు ఇచ్చాడు. భుజంగరావు నేరుగా ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే, వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి భుజంగరావు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం రాధాకిషన్ ను ప్రభాకర్ రావు ఉపయోగించాడు. ఎవరైనా డబ్బులు తీసుకెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి అధికారులు పట్టుకున్నారు.

Exit mobile version