Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- కూకట్ పల్లిలో విషాదం
- నవ దంపతులు ఆత్మహత్య
- మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవ దంపతుల మృతితో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కార్తీక్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మంజుల హౌస్ వైఫ్. NTV తో మృతుడు సోదరుడు మాట్లాడుతూ.. ఇద్దరు సూసైడ్ చేసుకోవడం మమ్మల్ని కలిచి వేసింది.. మేము షాక్ లో ఉన్నామని తెలిపారు. కార్తీక్ మంజుల సూసైడ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. కార్తీక్ ఎంత ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. తనకు అరగంట క్రితం పోలీసు నుండి మా సోదరుడు సూసైడ్ చేసుకున్నాడని కాల్స్ వచ్చినట్లు తెలిపాడు.
Also Read
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
దీంతో ఇంటికి చేరుకుని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం.. బెడ్ రూంలో కార్తిక్ హ్యాంగ్ చేసుకున్నాడు.. మంజుల పాయిజన్ తీసుకుందని తెలిపాడు. కార్తీక్ మంజుల ఇద్దరు మంచిగా ఉండేవారన్నారు. నిన్న సాయంత్రం వారి ఇద్దరితో మాట్లాడాను వారు మంచిగా మాట్లాడారని చెప్పారు. ఎందుకు సుసైడ్ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదన్నారు. కారణం ఏంటో అసలు తెలియదు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
కూకట్పల్లి సీఐ శోభన్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు మాకు సమాచారం అందింది.. ప్రైవేట్ హాస్పిటల్ వారు మాకు కాల్ చేసి ఇద్దరు సూసైడ్ చేసుకున్న కేస్ వచ్చిందని తెలిపారు. దీంతో మా టీమ్ తో ఆసుపత్రికి చేరుకున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు.. కార్తీక్ బెడ్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నాడు మంజుల పాయిజన్ తీసుకున్నట్లు ఉందని తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు నవ దంపతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కారణాలు తెలియరాలేదని అన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్తీక్ ఇంట్లో క్లూస్ టీం తో ఆధారాల సేకరిస్తున్నాం.. సూసైడ్ నోట్ లభించలేదని సీఐ శోభన్ తెలిపారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!