Jishnu Dev Varma: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ..
- తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ..
- ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు..
- రాజకుటుంబ నేపథ్యం.. అయోధ్య ఉద్యమంలో పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jishnu Dev Varma: తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. మరికొందరికి స్థాన చలం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొంత మంది మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను భర్తీ చేయనున్నారు. జిష్ణుదేవ్ ఆగష్టు 15, 1957న జన్మించారు. జిష్ణుదేవ్ వర్మ రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఆయన ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: Astrology: జులై 28, ఆదివారం దినఫలాలు
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
* హరిబాబు కిషన్రావ్ బాగ్డే రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
* తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు.
* ఓం ప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్‌గా నియమితులయ్యారు.
* సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
* ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా రామన్ దేకా నియమితులయ్యారు.
* సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.
* ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా పంపారు.
* అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్‌గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు.
* సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్‌గా పంపుతూ.. మణిపూర్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.
Spirituality: రోజూ నిద్ర లేచిన తర్వాత ఇలా చేయండి..అంతా మంచే జరుగుతుంది..!
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!