Janasena: జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు.. అయితే, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్ హాక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం, GHMC పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Also: Nayanthara: చిరు మూవీతో.. కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార
మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచే దిశగా పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించిన పవన్, కమిటీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలికంగా అడ్‌హాక్ కమిటీలను నియమించారు. ఈ కమిటీలు మొత్తం 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. కొత్తగా నియమితులైన అడ్‌హాక్ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 300 వార్డుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రతి వార్డు నుంచి కనీసం ఐదుగురు చురుకైన సభ్యుల జాబితాను సిద్ధం చేసి, పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావడం వీరి ప్రధాన బాధ్యత. అడ్‌హాక్ కమిటీ నివేదికలు అందిన తర్వాత, పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేలా కొత్త శాశ్వత కమిటీలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం, బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కేడర్‌ను మరింత చురుకుగా మార్చి, స్థానిక నాయకత్వాన్ని గుర్తించే దిశగా ఈ చర్యలు తీసుకున్నామని ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడేలా త్వరలోనే కీలక కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీల రద్దు, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం
• తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం
• GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి… pic.twitter.com/s7FFwZChV0— JanaSena Party (@JanaSenaParty) January 5, 2026