రోజురోజుకి చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రికార్డు స్థాయిలో ధరలు కొండెక్కాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా టమాట ధరలు ఆకాశానంటుతుండగా.. ఉల్లి సామాన్యులను కంటతడి పెట్టిస్తోంది.ఇప్పుడు చికెన్ ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు.
ఒక్క చికెన్ ధరలు మాత్రమే కాదు.. మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. శుభకార్యాల సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో కిలో చికెన్ స్కిన్ లెస్ ధర రూ. 280 నుంచి రూ. 300 వరకు ఉంది. లైవ్ బర్డ్ ధర కిలో రూ.80 నుంచి 100 వరకు ఉంది. అలాగే మటన్ ధర కూడా రూ.700 నుంచి 800 వరకు అమ్ముతున్నారు.