iBomma Ravi: సైబర్ క్రైమ్ విచారణలో ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవిపై కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి. రవి ఉపయోగించిన మెయిల్స్, డొమెయిన్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం పోలీసులు ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. విచారణలో ముఖ్య విషయాలు వెలుగు చూశాయి.. రవి ఉపయోగించిన ఇమెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేస్ చేశారు. ప్రతి డొమెయిన్కి ప్రత్యేక కోడ్‌ను జోడించినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యే వెంటనే బెట్టింగ్ యాప్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా వ్యవస్థ రూపొందించినట్టు ఆధారాలు దొరికాయి.…