HCU: హెచ్‌సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్‌సీయూ వార్తల్లో నిలిచింది. ఫ్రాటర్నిటీ గ్రూప్స్ అయిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం గుర్తింపు.
Read Also: BBC Documentary on Modi: మోదీపై డాక్యుమెంటరీ.. బీబీసీపై విచారణకు పిటిషన్..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్రం బ్లాక్ చేసిన కొద్ది రోజుల తర్వాత క్యాంపస్ లో ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య ఉద్రక్తత తలెత్తింది. కొంతమంది విద్యార్థులు కావాలని డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఏబీవీపీ ఆరోపిస్తూ వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిర్యాదు అందినట్లు, నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు యూనివర్సిటీ అడ్మినిస్టేషన్ వెల్లడించింది. ఆ తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదిలా ఉంటే సిరీస్ బ్యాన్ ముందే దీన్ని ప్రదర్శించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ అల్లర్లలో మోదీ పాత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేపడుతోందని పలు వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడంపై అటు యూకేలో, ఇటు ఇండియాలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ వీడియోను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్ లను ఆదేశించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు