Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తుంది. ఫాన్సీ నెంబర్ల వేలం ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఇవాళ ( సెప్టెంబర్ 12న) ఒక్కరోజు జరిగిన వేలంలోనే రవాణా శాఖకు 63 లక్షల 77 వేల 361 రూపాయల ఆదాయం వచ్చింది. అయితే, ఈ వేలంలో అనేక మంది వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు తమకు కావలసిన ఫాన్సీ నంబర్ల కోసం లక్షలు వెచ్చించి ఆయా నెంబర్లను దక్కించుకున్నారు. ఇందులో అత్యధిక ధరకు అమ్ముడైన నెంబర్ TG09G9999, దీన్ని హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ సంస్థ రూ.25,50,200లకు దక్కించుకుంది.
Read Also: Karimnagar : ఓ విద్యార్ధినిని కాలితో తన్నిన CI శ్రీలత, ఉద్రిక్తతలకు దారితీసిన ABVP ఆందోళన
ఇక, TG09H0009 నెంబర్‌ను ఏఆర్‌ఎల్ టైర్స్ లిమిటెడ్ రూ.6,50,009లకు సొంతం చేసుకున్నారు. అలాగే, TG09H0001 నెంబర్‌ను డాక్టర్ రాజేశ్వరి స్కిన్ & హెయిర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,25,999లకు దక్కించుకుంది. TG09H0006 నెంబర్‌ను ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ రూ.5,11,666లకు కొనుగోలు చేసింది. TG09H0005 నెంబర్‌ను వెంకటేశ్వరరావు శ్రీంగవరపు రూ.2,22,000లకు దక్కించుకున్నారు. TG09H0007 నెంబర్‌ను పోచా విజయ రూ.1,51,999లకు తీసుకున్నారు. TG09H0099 నెంబర్‌ను తాహెర్ సినీ టెక్నిక్ రూ.1,30,999లకు దక్కించుకున్నారు.
Read Also: iPhone 16 Pro Price: యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే న్యూస్.. ఐఫోన్ 16 ప్రోపై రూ.43 వేల తగ్గింపు!
అలాగే, TG09G9990 నెంబర్‌ను మిర్ అష్‌ఫాక్ జహీర్ రూ.1,22,000లకు దక్కించుకున్నారు. TG09H0027 నెంబర్‌ను ఉజ్వల మనోహర్ మడాస్ రూ.1,04,999 సొంతం చేసుకున్నారు. TG09H0234 నెంబర్‌ను ముప్పాల రాజశేఖర్ రాజు రూ.1,01,234లకు తీసుకున్నారు. కాగా, ఈ ఫాన్సీ నెంబర్ల వేలం ద్వారా భారీ ఆదాయం రావడంతో రవాణా శాఖ ఆనందం వ్యక్తం చేసింది. మరోవైపు, హైదరాబాద్ లో ఫాన్సీ నెంబర్లపై క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు.