Site icon NTV Telugu

Traffic Restrictions: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

Old City

Old City

Traffic Restrictions: హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌- 2025 పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఈ పోటీలు జరగనుండగా.. ఈ సందర్భంగా తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను ఈ వరల్డ్‌ బ్యూటీస్‌ చుట్టేస్తున్నారు. నిన్న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సందడి చేసిన ఈ మిస్ వరల్డ్స్.. ఇవాళ హైదరాబాద్‌ లోని చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు.

Read Also: Bhairavam: ‘భైరవం’ సెట్స్‌లో వంటలు ఇరగదీసిన మంచు మనోజ్, నారా రోహిత్‌..

అయితే, పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపునకు మళ్లించారు. అలాగే, మొగల్ పురా నుంచి వచ్చే వాహనాలను వోల్గా జంక్షన్ వైపు దారి మళ్లించారు. ఇక, పురాణాపూల్ నుంచి వచ్చే వెహికిల్స్ ను సిటీ కాలేజ్, ఫతే దర్వాజా వైపుకు వెళ్లాలని సూచించారు.

Read Also: Pakistan: ఆ విషయం పరిష్కరించకుంటే ‘‘యుద్ధ చర్య’’గానే భావిస్తాం..

కాగా, హైదరాబాద్ నగర పోలీసులు ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబు, డాగ్ స్క్వాడ్ లతో రూట్ మ్యాప్ భద్రత తనిఖీలు చేస్తున్నారు. ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ ఆర్మూర్ రిజర్వ్, కేంద్ర సాయుద బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు లాంటివి ఎగరవేయరాదని పోలీసులు హెచ్చరించారు.

Exit mobile version