International Cultural Festival: నేటి నుంచి లోక్ మంథన్.. హాజరుకానున్న రాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు
- ఈనెల 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం ..
- హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలు రాష్ట్రాల గవర్నర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Cultural Festival: లోక్ మంథన్ (అంతర్జాతీయ సాంస్కృతిక) మహోత్సవానికి భాగ్యనగరం వేదిక కానుంది. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేందుకు సిద్ధమైంది. నేటి (గురువారం) నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే వేడుకలకు శిల్పారామంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్ మంథన్ అంటే జానపద జాతర. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లోక్‌మంథన్ నిర్వహించారు. ఒక్కో రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇది నాల్గవ లోకమంతన్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరుకానున్నారు.
Read also: Astrology: నవంబర్ 21, గురువారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
లోక్‌మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. దేశంలోని జానపద కళాకారులందరినీ ఒక చోట చేర్చి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రజ్ఞాప్రవాహ అనే సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతినిధులు, విదేశీ కళాకారులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. లోక్‌మంథన్ వేడుకలో గిరిజన హస్తకళల, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వివిధ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలు తమ నైపుణ్యాలను ప్రదర్శించే కార్యక్రమం కూడా ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 1500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, ఉపకరణాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.
Read also: Parliament Winter session: ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’ పై పార్లమెంట్లో చర్చ తేదీ ఖరారు.. ఎప్పుడంటే?
గురు, శుక్రవారాల్లో రాష్ట్రపతి ముర్ము షెడ్యూల్..
కాగా, గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్నారు. గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ నేడు సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి.. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. ఇవాళ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు.
Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!