Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్లు.. నా నియోజక వర్గంలోని తనుగుల చెక్ డ్యామ్ను కూడా బాంబు పెట్టీ పేల్చారని ఆరోపించారు.
అయితే, సభలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు.. బాంబులు పెట్టీ పేల్చారు అనడం ఏంటి అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి వెంటనే తొలగించాలి అని కోరారు.
