Telangana High Court: వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. పరిష్కార మార్గాలను హైకోర్టు అన్వేషించాలని సూచింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. GHMC పరిధిలో 3 లక్షల 80 వేల వీధి కుక్కలున్నాయన్న ప్రభుత్వం.. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని తేల్చి చెప్పింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Read also: Biggest Dinosaur: వేలంలో రూ.81కోట్లకు అమ్ముడు పోయిన డైనోసర్ అస్థిపంజరం
నగరంలో వీధికుక్కల సమస్యను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు.. వాటి నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల దాడిలో రోజు రోజుకు చిన్నారులు మృతి చెందిన ఘటనలను వెలుగు చూస్తున్నాయని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొంది. జీహెచ్‌ఎంసీపై వీధికుక్కలు దాడి చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది.
Read also: Mallu Bhatti Vikramarka: లీడ్ బ్యాంకులు లోన్ల విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు..
అయితే ప్రభుత్వం దృష్టి ధనవంతులు నివసించే ప్రాంతాలపై కాకుండా సామాన్యులు నివసించే మురికివాడలపైనే ఉండాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిని కేసుగా పరిగణించవద్దని, తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులు స్పందించాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటిలోగా కుక్కల దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియజేయాలని స్పష్టం చేసింది.
Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..