Site icon NTV Telugu

Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్

Rain

Rain

Heavy Rain: హైదరాబాద్‌ నగరంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్‌పేట, టోలిచౌకి, బీరంగూడ, పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కోఠి, గచ్చిబౌలి, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షానికి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.

Read Also: Home Minister Vangalapudi Anitha: బాలికల హాస్టల్‌లో హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీలు.. ఊహించని ఘటన..!

అయితే, వర్షం కురవడంతో ఐటీ కారిడార్ లోని ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయింది. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షానికి వాహనాలు స్లోగా ముందుకు కదలడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మరి కొన్ని గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే, జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు రంగంలోకి దిగాయి.

Exit mobile version