Heatwave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
- ఏపీలో 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణొగ్రతలు ..
- ఇవాళ 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
- తెలంగాణలోనూ మండిపోతున్న ఉష్ణోగ్రతలు..
- పలు ప్రాంతాల్లో 41-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave in Telugu States: నిప్పుల కొలిమి.. నిప్పుల కుంపటి.. ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలనుందా.. ఉదయం 9 గంటలకు అలా రోడ్డెక్కండి చాలు.. అర్థాలు తెలుసుకోవడమే కాదు.. స్పెల్లింగ్ కూడా రాసేస్తారు. అట్టుంటది మనతోని అని భాస్కరుడు భగ్గుమంటుంటే.. ఇవేం ఎండల్రా నాయనా అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్‌లోనే రోహిణి రేంజ్‌లో సూర్యప్రతాపం కనిపిస్తోంటే.. ఇంకో మూడు నాలుగు రోజులు ఇళ్లల్లోనే ఉండండి అని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెయినీ సీజన్‌లో వానలు దంచికొడుతున్నాయ్ అంటాం కదా.. ఈ సమ్మర్‌లో ఎండ దంచికొడుతోంది అనాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఆరు గంటలకే ప్రజెంట్ సర్ అంటూ అటెండెన్స్ ఇస్తున్న సూర్యుడు.. నిమిష నిమిషానికి నిప్పుల కొలిమిలా మారిపోతున్నాడు. 9 గంటలకే మాడు పగిలే రేంజ్‌లో నిప్పులు కురిపిస్తున్నాడు. పదయ్యే సరికి టెంపరేచర్ సర్రున పెరిగిపోతోంది. ఇంకో అరగంట కాకుండానే.. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు భగభగలుంటున్నాయి.
Read Also: PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్ టచ్ అయింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాటలు.. జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి రావొద్దని అధికారులు చెబుతుంటే.. హైరానా పడిపోతున్నారు. మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏపీలో భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతుంటే.. ఇవాళ మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని.. 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డగ్రీల టెంపరేచర్ నమోదయింది. రాబోయే రెండు, మూడు రోజులు.. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 37 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున్న జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!