Site icon NTV Telugu

Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!

Harish Rao

Harish Rao

Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే.. ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్లా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వస్తున్న రూ. 2 వేల పింఛన్ ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని హరీశ్ రావు ఆరోపించారు.

Read Also: Wamiqa : ప్లాప్ హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు

ఇక, ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ.. మరో వైపు చేతికందిన పింఛన్ ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయం అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని.. ఇంటి పన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇలా చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Exit mobile version