Site icon NTV Telugu

Gaddar Film Awards: నేడే గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్

Gaddar Film

Gaddar Film

Gaddar Film Awards: తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబురాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొననున్నారు.

Read Also: Ahmedabad Plane Crash: బాధిత కుటుంబాల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం

అయితే, గద్దర్ అవార్డులకు ఎంపికైన విజేతలతో పాటు జ్యూరీ ఛైర్మన్లు జయసుధ, మురళీమోహన్ సహా పలువురు సినీతారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా కొనసాగనుంది. సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అవార్డులను పునః ప్రారంభించింది. 2024 సంవత్సరానికే కాకుండా 10 ఏళ్ల అవార్డులను సైతం ప్రకటించి చిత్ర పరిశ్రమలోనూ, నటీనటుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతుంది.

Read Also: Forced Debt Collection: బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుకే.. బిల్లుకు ఆమోదం

గద్దర్ అవార్డులు అందుకునే వారు వీరే..

* ఉత్తమ చిత్రం – కల్కి
* ఉత్తమ రెండో చిత్రం – పొట్టేల్
* ఉత్తమ మూడో చిత్రం – లక్కీభాస్కర్
* ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప-2)
* ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథకాదు)
* ఉత్తమ డైరెక్టర్ – నాగ్ అశ్విన్ (కల్కి)
* ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
* ఉత్తమ సహాయ నటి – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్)
* ఉత్తమ హాస్యనటుడు – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
* ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్ (రజాకార్)
* ఉత్తమ స్టోరీ రైటర్ – శివ పాలడుగు
* ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
* ఉత్తమ గాయకుడు – సిద్ద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)
* ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
* ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య (దేవర)
* స్పెషల్ జ్యూరీ అవార్డు – దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)
* స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల (పొట్టేల్)
* బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ – యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
* 2024 ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథకాదు
* బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ – హెరిటేజ్-హిస్టరీ విభాగం – రజాకార్
* నేషనల్ ఇంటెగ్రిటీ – సోషల్ అప్‌లిఫ్ట్ విభాగం – కమిటీ కుర్రాళ్లు

Exit mobile version