Vikarabad Tension: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న సబిత, సత్యవతి రాథోడ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు మాజీ మంత్రులను అదుపులో తీసుకున్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి లను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
Read also: Delhi: ప్రధాని మోడీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. కేబినెట్ కూర్పుపై చర్చ
తాండూర్ గిరిజన సంక్షేమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటన తెలిసిందే. అయితే విద్యార్థులను పరామర్శించేందుకు ఇవాళ బీఆర్‌ఎస్ నాయకులు బయలుదేరి వెళ్ళారు. బీఆర్ఎస్ నేతలు వస్తున్నారనే వార్తతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాండూరు వసతి గృహం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వసతి గృహం లోపలికి బీఆర్ఎస్ నాయకులను అనుమతించలేదు. దీంతో గేటు ముందు బీఆర్ఎస్ నాయకుల బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. విద్యార్థులను వసతి గృహంలోనే ఉంచి చికిత్స అందించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకరిద్దరి విద్యార్థులకు మాత్రమే అస్వస్థతకు గురి అయ్యారని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూర్ గిరిజన సంక్షేమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన అని ప్రశ్నించారు. వసతి గృహంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరైనది కాదన్నారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతున్నారా? వారిని చంపుతున్నారా? అని మండిపడ్డారు. కలెక్టర్ అబద్ధాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యం కొనసాగుతుందని అన్నారు. 50కి పైగా బ్లడ్ శాంపిల్స్ బయటినుంచి ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. విద్యార్థులను హాస్టల్లో ఉంచి ఎందుకు వైద్యం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకుల నినాదాలు చేశారు.వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
Allu Arjun: ఢిల్లీకి అల్లు అర్జున్.. తిరుమల శ్రీవారి సేవలో భార్య