కేసీఆర్ కు ఓట్లు, నోట్లు, సీట్లే కావాలి : బీజేపీ మాజీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు.
పరిపాలన పూర్తిగా స్తంభించిందని, సీఎం కేసీఆర్‌కు ఓట్లు, నోట్లు, సీట్లు కావాలే తప్ప ప్రజల పాట్లు అక్కరలేదు అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న కుటుంబ సమేతంగా క్యాంప్ లు పెట్టారని, సీఎం క్యాంపు లో ఉన్న వారితో మాట్లాడుతున్నారు కానీ ధాన్యం కొనుగోలు పై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి క్యాంపు ల్లో కునుకుతున్నాడని, క్యాంపుల పై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారుల పై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని, గవర్నర్ ఐకేపీ సెంటర్ లను సందర్శించాలని ఆయన కోరారు.
Also Read
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!