Site icon NTV Telugu

KCR: కేసీఆర్కు అనారోగ్యం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

Kcr

Kcr

KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్‌ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్‌ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇక, 3 రోజుల పాటు హైదరాబాద్ లోని నంది నగర్‌ నివాసంలోనే కేసీఆర్‌ ఉండనున్నారు.

Read Also: IPS Officer Siddharth Kaushal Resigns: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్‌పై కొత్త చర్చ..

అయితే, సీజనల్ ఫీవర్ తోనే కేసీఆర్ బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి నందినగర్‌ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌కు వైద్యులు పలు టెస్టులు చేశారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు యశోదా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌కు మెడికల్ టెస్టులు చేసినట్లు టాక్. కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ఇక, కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయాల్సి ఉంది.

Exit mobile version