Muslim Countries: ఇస్లాంలో మద్యం తాగడం నిషేధం. అల్లాహ్ పవిత్ర ఖురాన్‌లో కూడా మద్యం తాగకూడదని ఆదేశించాడు. మద్యం తాగడం వల్ల ఒక వ్యక్తి ప్రశాంతతను కోల్పోతాడని, కాబట్టి దానిని నిషేధించినట్లు మత బోధకులు చెబుతున్నారు. యెమెన్, సూడాన్‌తో సహా అనేక ముస్లిం దేశాలలో మద్యం నిషేధించబడినప్పటికీ, మద్యం పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్న అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Kakinada: కాకినాడ జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి!
సౌదీ అరేబియా, కువైట్ వంటి అనేక ముస్లిం దేశాలు మద్యంపై పూర్తి నిషేధాన్ని విధించాయి. అయితే యుఎఇ, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో సహా అనేక ముస్లిం దేశాలలో ముస్లిం పౌరులకు మద్యం సేవించడం నిషేధించారు. అయితే ఈ దేశాలలో ముస్లిమేతరులు పర్మిట్ పొందిన తర్వాత మద్యం తాగవచ్చు.
కిర్గిజ్స్తాన్: ముస్లిం దేశాలలో కిర్గిజ్స్తాన్‌లో మద్యం పెద్ద మొత్తంలో వినియోగిస్తారు. ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్ వెబ్‌సైట్ ప్రకారం.. కిర్గిజ్స్తాన్ ప్రజలు ముస్లింలుగా ఉన్నప్పటికీ, తాగడానికి అధికంగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా ఈ దేశంలో శీతాకాలంలో బహిరంగంగా తాగుడు సర్వసాధారణం. ఈ దేశంలో వోడ్కా అనేది సాధారణంగా వినియోగించే పానీయం, తరువాత బీర్, స్వీట్ వైన్, స్వీట్ షాంపైన్ ఉంటాయి. కిర్గిజ్స్తాన్ ప్రజలు చాలా ఎక్కువగా వోడ్కా తాగుతారు. దాదాపు ప్రతి వేడుక లేదా సందర్భంలోనూ ఇది తప్పనిసరిగా ఉండాలని భావిస్తారు.
యుఎఇ: UAE కి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఈ దేశం ముస్లిమేతరులకు మద్యంపై ఆంక్షలను సడలించింది. UAE లో ముస్లిం పౌరులకు మద్యం సేవించడం నిషేధించింది. కానీ ముస్లిమేతర నివాసితులకు, పర్యాటకులకు మద్యం నియంత్రిత పద్ధతిలో అందుబాటులో ఉంది. UAEలో లైసెన్స్ పొందిన రెస్టారెంట్లు, హోటళ్ళు లేదా ఇతర తగిన ప్రదేశాలలో మద్యం అమ్మకం అనుమతించారు. ముస్లిమేతరులు ప్రైవేట్ నివాసాలు, హోటళ్ళు లేదా బార్లలో మద్యం తాగవచ్చు. అయితే బహిరంగంగా మద్యం తాగడం లేదా మద్యం తాగినట్లు కనిపించడం ఈ దేశంలో నిషేధించారు. విదేశీ పర్యాటకులు వారి వ్యక్తిగత వినియోగం కోసం పరిమిత మొత్తంలో దేశంలోకి మద్యం తీసుకురావడానికి అనుమతి ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం.. 2022లో దేశంలో సగటున ఏడాదికి 0.8 లీటర్ల మద్యం వినియోగించారు.
పాకిస్థాన్: స్వాతంత్ర్యం తర్వాత మొదటి మూడు దశాబ్దాల పాటు పాకిస్థాన్‌లో మద్యం అమ్మకం, వినియోగానికి అనుమతి ఉంది. అయితే జుల్ఫికర్ అలీ భుట్టో పాలనలో ఇది పూర్తిగా నిషేధించారు. 1977లో ఆయన పదవీచ్యుతుడైన తర్వాత కూడా ఈ నిషేధం అమలులో ఉంది. వరల్డ్ అట్లాస్ ప్రకారం.. దేశంలోని ముస్లిం సమాజం ప్రస్తుతం మద్యం ఉత్పత్తి చేయడం, అమ్మడం లేదా తాగడం పూర్తిగా నిషేధించారు. అయితే ముస్లిమేతర మైనారిటీలు మద్యం అనుమతులు పొందేందుకు ఈ దేశాలు అనుమతించాయి. ఈ అనుమతులు తరచుగా ఒక వ్యక్తి ఆర్థిక స్థితి ఆధారంగా జారీ చేస్తున్నారు. ముస్లిమేతరులు సాధారణంగా నెలకు సుమారు 5 బాటిళ్ల వైన్, 100 బాటిళ్ల బీరు తీసుకోడానికి అనుమతి ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం.. 2022లో పాక్ సంవత్సరానికి 0.1 లీటర్ల మద్యం వినియోగించింది.
కజకిస్థాన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2020 డేటా ప్రకారం.. కజకిస్థాన్ అత్యధికంగా మద్యం వినియోగం కలిగి ఉంది. తరువాత కిర్గిజ్స్తాన్, తుర్క్మెనిస్థాన్ రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి. కజకిస్థాన్ 2010లో తలసరి మద్యం వినియోగం 9.3 లీటర్లు, ఇది 2016లో 7.7 లీటర్లకు తగ్గింది. 2022లో ఇది 5.4 లీటర్లకు చేరుకుంది.
కిర్గిజ్స్తాన్ : ఈ దేశంలో కూడా మద్యం వినియోగం తగ్గుదల కనిపిస్తుంది. తలసరి మద్యం వినియోగం 2010లో 10.2 లీటర్ల నుంచి 2016లో 6.2 లీటర్లకు తగ్గింది. 2022 నాటికి ఇది 3.9 లీటర్లకు చేరుకుంది.
ఉజ్బెకిస్థాన్ : 2010లో తలసరి 3.2 లీటర్లుగా ఉన్న మద్యం వినియోగం 2016లో 2.7 లీటర్లకు తగ్గింది. 2022 నాటికి ఇది 2.1 లీటర్లకు తగ్గింది.
తుర్క్మెనిస్తాన్ : 2010లో తలసరి వినియోగం 6 లీటర్లు, ఇది 2016లో 5.4 లీటర్లకు తగ్గింది. 2022లో ఇది 3.0 లీటర్లకు చేరుకుంది.
తజికిస్థాన్ : 2010లో ఈ దేశంలో తలసరి వినియోగం 2.4 లీటర్లుగా ఉన్న మద్యం వినియోగం 2016లో 3.3 లీటర్లకు పెరిగింది. 2022లో ఇది 0.7 లీటర్లకు చేరుకుంది.
మౌరిటానియా: పశ్చిమ ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరిటానియాలో ముస్లింలు మద్యం కలిగి ఉండటం, సేవించడం, అమ్మడం లేదా తయారు చేయడం నిషేధించారు. అయితే ముస్లిమేతరులు తమ ఇళ్లలో లేదా చెల్లుబాటు అయ్యే ఆల్కహాల్ పర్మిట్ ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లలో మద్యం తాగడానికి అనుమతి ఉంది.
ఈజిప్టు: ఈజిప్టులో మద్యం తాగడం చట్టబద్ధమే, కానీ బహిరంగ ప్రదేశాల్లో దీనిని నిషేధించారు. అలాగే రంజాన్ సందర్భంగా ముస్లింలకు మద్యం అమ్మకం నిలిపివేశారు. అలాగే దేశంలో హోటళ్ళు, బార్‌లు, ఆమోదించిన పర్యాటక ప్రదేశాలలో మద్యం అందుబాటులో ఉంది. ఈ దేశంలో వీధుల్లో లేదా వాహనంలో మద్యం తాగడం చట్టవిరుద్ధం, జరిమానాతో శిక్షార్హమైనది. 2022 వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం.. 2022లో దేశంలో సగటున మద్యం వినియోగం సంవత్సరానికి 0.1 లీటర్లు.
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్‌లో ముస్లింలకు కఠినమైన మద్యం వినియోగ నిబంధనలు ఉన్నాయి. ఈ దేశంలో ముస్లిమేతరులు పర్మిట్‌తో మాత్రమే మద్యం కొనుగోలు చేయగలరు. ఇలా కొనుగోలు చేయడానికి కూడా కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. దేశంలో ఒకే ఒక మద్యం కంపెనీ ఉంది. దాని పేరు – కెరు. దేశంలో ఆంక్షలు ఉన్నప్పటికీ 2024-25లో కెరు దాని ప్రారంభం (బ్రిటిష్ కాలం) నుంచి అతిపెద్ద లాభాన్ని ఆర్జించింది. దాదాపు $10 మిలియన్లు (రూ. 84 కోట్లు). ఈ అమ్మకాలు ప్రధానంగా దేశంలో పనిచేస్తున్న విదేశీయులు.. సుమారు 150,000 మంది హిందూ తేయాకు తోటల కార్మికులచే నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ జనాభాలో ముస్లిమేతరులు దాదాపు 10% ఉన్నారు. వారే మద్యానికి ప్రధాన వినియోగదారులుగా ఉన్నారు. కెరు కంపెనీ నివేదికల ప్రకారం.. వారి మద్యం మార్కెట్ చేయరు. ఇప్పటికే తాగేవారికి మాత్రమే వారి మద్యం అమ్ముతున్నారు. దేశంలో ప్రసిద్ధ బ్రాండ్లలో ఇంపీరియల్ విస్కీ, సరీనా వోడ్కా కూడా ఉన్నాయి.
READ ALSO: G20 Summit: జీ–20 వేదికకు దూరంగా ఈ ముగ్గురు అగ్రనేతలు.. కారణం ఏంటో తెలుసా?