Etela Rajender Gives Clarity That There Is No Differences Among BJP Leaders: కిషన్ రెడ్డితో తనకు విభేదాలున్నాయని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తమ మధ్య అంతా సఖ్యతగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల కమిటీ నిర్వహణ ఛైర్మన్ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే.. ఎంపి బండి సంజయ్ కుమార్‌తోనూ తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇదంతా మీడియా సృష్టించిన కన్ఫ్యూజన్ తప్ప, తమ మధ్య విభేదాలేమీ లేవన్నారు. నాయకులందరూ బాగానే కలిసి ఉన్నారని చెప్పారు. కొంతమంది ఈమధ్య రచ్చకీడ్చుకుంటున్నారని, అది మంచిది కాదని హితవు పలికారు. రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు ఆయా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తుంటాయని.. బీజేపీ కూడా అలాంటి మార్పులే చేసిందని తెలిపారు. ఇటు రాష్ట్ర నేతలు, అటు అధిష్టానం.. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో ఉన్నారని.. అందుకే తాజా మార్పులు చేయడం జరిగిందని స్పష్టతనిచ్చారు.
Somu Veerraju: సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. వాటికి నా శరీరం అలవాటు పడింది..!
పార్టీ కోసం నిబద్దతతో పని చేసే వారికే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందరం కలిసి సమిష్టిగా పని చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. తాను గ్రూప్ రాజకీయాలను ఏమాత్రం ప్రోత్సాహించనని తెగేసి చెప్పారు. రాజకీయాల్లో తనకు, కిషన్ రెడ్డికి అపారమైన అనుభవం ఉందని.. తమకున్న అనుభవంతో తామిద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. పార్టీలో పనిచేయాలన్నా, ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలన్నా.. క్రమశిక్షణ, నిబద్ధత చాలా అవసరమని సూచించారు. కిషన్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాలు కొట్టిన పిండి వంటివని కొనియాడారు. ఏదేమైనా.. అంతిమంగా గెలుపోటములు కీలకం కాబట్టి, గెలుపు దిశగా తామంతా కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల అంతరంగం తనకు తెలుసని అన్నారు. తనమీద విశ్వాసం ఉంచి, తనకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించినందుకు గాను బీజేపీ హైకమాండ్‌కి ధన్యవాదాలు తెలిపారు.
Sandra Venkata Veeraiah: కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే సండ్ర ఫైర్.. అప్పుడెందుకు చేయలేదు?