Site icon NTV Telugu

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్..! ట్రావెల్స్‌ బుకింగ్స్‌ రద్దు.. ఆర్టీసీకి పెరిగిన గిరాకీ..

Rtc

Rtc

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అంతా ఉలిక్కి పడేలా చేసింది.. ఈ ఘటనతో అసలు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రయాణికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయే విమర్శలు కూడా వచ్చాయి.. అయితే, ఆర్టీఏ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు.. బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్‌సీ, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్‌టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ ఇలా.. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రవాణా శాఖ అధికారులు.. మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమానుల్లో కాస్త చలనం వచ్చినట్టుగా కనిపిస్తోంది.. ఫిట్‌నెస్‌ లేని బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు ఆయా ట్రావెల్స్‌ యాజమాన్యాలు.. దీంతో, ముందుగా బుక్‌ చేసిన టికెట్లను సైతం రద్దు చేస్తున్నారు..

Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?

సాధారణంగా వీకెండ్‌ కావడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో భారీగా బుకింగ్స్‌ ఉంటాయి.. వీకెండ్ కోసం ముందే బుక్‌ చేసుకునేవాళ్లు కూడా ఉంటారు.. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సులపై ఆర్టీఏ చర్యలు ప్రారంభించింది.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు బెంగళూరులోనూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల తనిఖీలు, సీజ్‌లు కొనసాగుతున్నాయి.. తెలంగాణలో వారం రోజుల ఆర్టీఏ స్పెషల్‌ డ్రైవ్‌లు కొనసాగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు బుకింగ్స్‌ రద్దు చేస్తున్నాయి.. ప్రయాణికులకు డబ్బులను రీఫండ్‌ చేస్తున్నాయి.. దీంతో, ఆర్టీసీ బస్సులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు..

Exit mobile version