Drunk Drive: మద్యం ప్రియులకు శని, ఆదివారాలంటే పండగే. కానీ.. ఆ రెండు రోజుల్లోనే పోలీసులు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అయితే ఈ డ్రంక్ డ్రైవ్‌లో కొందరు కామ్‌గా పోలీసులు చెప్పినట్టుగా చేసేసి వెళ్లిపోవడం..పట్టుబడితే ఫైన్ కట్టేయడం జరుగుతుంది. మరి కొందరు మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. ఇంకొందరైతే మద్యం మత్తులో ఏకంగా పోలీసుల పైనే దాడికి పాల్పడుతుంటారు. అది తాగిన మత్తో లేక డబ్బుందనే అహంకారమో తెలియదు కానీ.. పోలీసుల పైనే విరుచుకు పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ బంజారా హిల్స్‌లో జరిగింది.
Read also: Pawan Kalyan: షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరు
బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్సై, హోమ్ గార్డ్‌పై పలువురు మహిళలు దాడికి పాల్పడిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 పార్కాయత్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి పార్క్ హయత్ వద్ద ఓ కారును ట్రాఫిక్ ఎస్ఐ అవినాష్ బాబు, హోంగార్డ్ నరేష్‌లు ఆపారు. అయితే.. కారు నడుపుతున్న మహిళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు హోంగార్డ్ ప్రయత్నించాడు. కాగా.. కారులో వున్న మొత్తం ఐదు మంది మహిళలు బూతులతో హోంగార్డ్ పై విరుచుకుపడ్డారు. దీంతో హోంగార్డ్ తన వద్ద వున్న ఫోన్ లో మహిళల ప్రవర్తనపై రికార్డు చేయసాగాడు. అంతే కోపంతో ఊగిపోయాని మహిళలు హోంగార్డ్ ఫోన్ ను తీసుకున్న ఓ మహిళ నేలకేసి కొట్టింది.
Read also: CM Chandrababu: విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. హాజరైన మంత్రి లోకేష్
మహిళల వీరంగాన్ని చూసిన ఎస్సై అవినాష్ అక్కడకు రావడంతో తనపై కూడా దాడి చేయడమే కాకుండా అక్కడున్న కెమెరాలను సైతం ధ్వంసం చేసింది. అంతే కాకుండా.. ఎస్ఐ నరేష్ ను తిట్టి పక్కకు తోసేసింది. దాంతో దాదాపు అర్ధగంట పాటు హైడ్రామా కొనసాగింది. కాగా ఇదంతా జరుగుతున్న క్రమంలో మహిళకు మద్దతుగా ఇద్దరు యువకులు సైతం రంగంలోకి దిగారు. వారిద్దరిని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు ఎస్సై, హోంగార్డ్ అప్పగించారు. హోంగార్డ్ నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులోని మహిళలు అందరూ కలిసి పబ్ కు వెళ్లి వస్తున్నారా? లేక పార్టీకి వెళ్లారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి వుంది.
Sangareddy Crime: ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి .