Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad Cyber Criminals Hacked Email And Stole 10 Crore

Cyber ​​Fraud: ఈమెయిల్ తో బురిడీ కొట్టించి.. రూ. 10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Published Date :February 8, 2025 , 12:53 pm
By Venkatesh
  • ఈమెయిల్ తో బురిడీ కొట్టించి
  • రూ. 10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
  • హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచిన సైబర్ క్రిమినల్స్
Cyber ​​Fraud: ఈమెయిల్ తో బురిడీ కొట్టించి.. రూ. 10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ కాల్స్, మెసేజెస్, లింక్స్ పంపించి ఖాతాలు లూటీ చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మరో మోసం వెలుగు చూసింది. హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచేశారు సైబర్ క్రిమినల్స్. ఈమెయిల్ తో బురిడీ కొట్టించి ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ కంపెనీ హాంకాంగ్ కంపెనీ నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తుంది. ముడిసరుకు అందిన తరువాత కంపెనీ నగదు బదిలీ చేస్తోంది.

అయితే హాంకాంగ్ కంపెనీతో కొనుగోళ్ళు, ఆర్థిక లావదేవీలు మొత్తం కూడా మెయిల్స్ ద్వారానే కొనసాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరస్తులు ఈమెయిల్ హ్యాక్ చేశారు. ఆ తర్వాత ముడి సరుకు కావాలంటూ సదర్ కంపెనీ హాంకాంగ్ కంపెనీకి ఎప్పుడు మెయిల్ పెడుతుందా అని ఎదురుచూశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కంపెనీ ఆ కంపెనీకి సరుకు కావాలంటూ మెయిల్ పెట్టింది. అయితే ముడిసరుకు చేరుకున్న తర్వాత నగదును మరో అకౌంట్ కు బదిలీ చేయాలంటూ సైబర్ నేరస్తులు మెయిల్ పెట్టారు. ప్రస్తుత అకౌంట్ ఆడిట్లో ఉన్నందున మరో అకౌంట్ కు బదిలీ చేయాలంటూ మెయిల్ పంపించారు.

హైదరాబాద్ కు చెందిన కంపెనీ రూ. 10 కోట్లను ఆ అకౌంట్ కి బదిలీ చేసింది. వారం రోజుల తర్వాత హైదరాబాద్ కంపెనీకి నగదు రాలేదంటూ హాంగ్‌కాంగ్‌ కంపెనీ సమాచారం ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న హైదరాబాద్ కంపెనీ సిబ్బంది, వారం క్రితమే డబ్బులు బదిలీ చేసిన అకౌంట్ డీటెయిల్స్ ని హాంగ్‌కాంగ్ కంపెనీకి పంపించారు. ఇది పరీశీలించిన తర్వాత ఆ అకౌంటు తమది కాదని, ఆ మెయిల్ కూడా తాము పంపలేదని హాంకాంగ్ కంపెనీ సిబ్బంది తెలిపారు. దీంతో మోసపోయామని గ్రహించిన హైదరాబాద్ కంపెనీ సిబ్బంది సైబర్ సెల్ ల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cyber criminals
  • email
  • Hacke
  • Hong Kong
  • hyderabad

తాజావార్తలు

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Storyboard : ఏపీలో కుల రాజకీయం పాతబడిందా..? కొత్తగా మత రాజకీయం మొదలైందా..?

  • Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

  • Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

  • Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions