KTR at Women’s Commission: మహిళా కమిషన్‌ ఆఫీసుకు కేటీఆర్.. కాంగ్రెస్ మహిళా నేతల నిరసన..!

  • హైదరాబాద్: బుద్ధభవన్ వద్ద ఉద్రిక్తత..
  • కేటీఆర్ కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన..
  • కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు..
Ktr O

Ktr O

KTR at Women’s Commission: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్ర ‍మహిళా కమిషన్‌ (బుద్ధ భవన్‌) ఆఫీసు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీమంత్రి కేటీఆర్‌ను ఉమెన్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వెళ్లిన కేటీఆర్‌ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్‌ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్‌ నేతలు కమిషన్‌ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Read Also: Minister Komatireddy: సీఎంకి మంత్రి కోమటిరెడ్డి లేఖ.. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా వేటు..!

ఇక, మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకునేందుకు వస్తున్న కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. మహిళలకు కేటీఆర్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో, అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అలర్ట్ అయిన.. పోలీసులు అక్కడ ఉన్న వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుద్ద భవన్ దగ్గర తోపులాట, ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు సమాచారం. మరోవైపు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది.